సెక్రటేరియెట్​పై డ్రోన్ ఎగరేసిన ఇద్దరిపై కేసు

సెక్రటేరియెట్​పై డ్రోన్ ఎగరేసిన ఇద్దరిపై కేసు

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర సెక్రటేరియెట్​పై డ్రోన్ ఎగరేసిన ఇద్దరు వ్యక్తులపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీహెచ్ఎంసీ అవుట్ సోర్సింగ్ ఇచ్చిన ఆదేశాల మేరకు..ఇటీవల నగరంలో చేపట్టిన సుందరీకరణ పనులను డ్రోన్ ద్వారా వీడియో తీసేందుకు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్టు ఇచ్చారు. మార్చి 11న రాత్రి కాంట్రాక్టు తీసుకున్న వంశీ, నాగరాజు తెలుగుతల్లి ఫ్లై ఓవర్ పరిసరాల్లో వీడియోని చిత్రీకరించి ,సెక్రటేరియెట్ మీదుగా డ్రోన్ ను పంపించారు.

ఇది గమనించిన ఎస్పీఎఫ్ పోలీస్ సిబ్బంది... సైఫాబాద్ పోలీసులకు  పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు... డ్రోన్ ఎగరేసిన వంశీ, నాగరాజులను అదుపులోకి తీసుకున్నారు. సెక్రటేరియెట్ అవుట్ పోస్ట్ తో పాటు సచివాలయం లాన్ ఏరియాను డ్రోన్ తో వీడియో చిత్రీకరించినట్లు గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చి  డ్రోన్ ను పోలీసులు సీజ్ చేశారు.